Skip to main content

సాయం మంచిదే Telugu story by HemanthPresents

 



సాయం మంచిదే!

విజయుడు, అజేయుడు అనే యువరాజులు

ఇద్దరూ ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం

పూర్తిచేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు

ఓ చిన్నపరీక్ష పెట్టాలను

కున్నారు గురువుగారు.

ఇద్దరినీ పిలిపించి...

'నాయనా, మన

ఆశ్రమానికి 70

క్రోసుల దూరంలో

కొన్ని ఆటవిక జాతుల

వారి గుహలున్నాయి.

వాటిలో అమూల్యమైన

మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసు

కొస్తారో వారే ఈ పరీక్షలో విజేత' అని చెప్పారు.

దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ

బయల్దేరారు. దారిలో వారికో వ్యక్తి తీవ్రగాయాలతో

కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందని

అజేయుడు ముందుకు వెళ్లిపోయాడు. కానీ

విజయుడు మాత్రం ఆగి, అతడికి సపర్యలు చేసి,

ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ

వ్యక్తి వెళ్లిపోయాక విజయుడు మళ్లీ బయల్దేరాడు.

కొంతదూరం వెళ్లాక అతడికి అజేయుడు ఆటవిక

తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే

విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని

విడిపించాడు. అంతేకాదు... వారు విజయుడిని

గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణి కూడా

ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి

అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు

విజయుడు... 'దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి

వీరి చేతిలో దాడికి గురైనవాడే. వాళ్లెలా ప్రవర్తిస్తారో

అతడే నాకు చెప్పాడు. దాన్నిబట్టీ వారిని నా మాట

లతో ఆకట్టుకున్నాను. వాళ్ల ద్వారానే మణిని కూడా

సంపాదించాను' అని చెప్పాడు. పక్కవారికి సాయం

చేస్తే అది మనకూ మంచేనన్న విషయం అప్పుడే

అజేయుడికి అర్థమైంది.


2.) Story

తెల్ల ఏనుగు


తెల్ల ఏనుగు

దండకారణ్యం అనే దట్టమైన అడవులలో ఒక తెల్ల ఏనుగు ఉండేది. అది చాలా ఉత్తమ గుణాలు గల ఏనుగు. ఆ ఏనుగుకు తల్లి ఉండేది. దానికి కళ్లు కనిపించేవి కాదు. ఆ తెల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకునేది. అరణ్యమంతా తిరిగి రుచికరమైన పళ్లను తెచ్చి తల్లికి ఇచ్చేది. అన్ని రకాల సేవలు చేసేది.

ఒకనాడు తెల్ల ఏనుగు ఆహారం కోసం వెళ్లి నపుడు దానికి మానవుడి ఏడుపు వినిపిం చింది. తెల్ల ఏనుగు ఆ మనిషి వద్దకు వెళ్లి కారణం అడిగింది. అప్పుడు ఆ మానవుడు, "నేను ఈ అడవిలో దారి తప్పి ఇటుగా వచ్చాను. మూడు రోజులుగా తిరుగుతూ ఉన్నా నేను వెళ్లాల్సిన దారి తెలియడం లేదు" అన్నాడు. అప్పుడు ఏనుగు ఆ మనిషికి అడవి చివరన ఉన్న అతని గ్రామం వరకు దారి చూపించింది. మనిషి ఊరికి వెళ్లగా అక్కడ రాజ భటుడు "రాజుగారి ఏనుగు మరణిం చింది. ఒక అపురూపమైన, రాజుగారికి యోగ్యమయ్యే ఏనుగును ఎవరు చూపిస్తారో వాళ్లకి బహుమతి ఇవ్వబడుతుంది" అని ప్రకటించడం విన్నాడు. తెల్ల ఏనుగు జాడ తెలుసుకున్నాడు కాబట్టి బహుమతికి ఆశపడి, రాజభటులకు సమాచారం అందించాడు. వారు ఆ తెల్ల ఏనుగును వలవేసి పట్టారు. రాజధాని నగ రానికి తెచ్చారు. ఆ ఏనుగుకు ఎంతో మర్యాద చేశారు. పుష్పాలతో అలంకరించారు. రాజభక్షలు పెట్టారు కాని ఆ తెల్ల ఏనుగు ఒక్కదానిని కూడా ముట్టుకోలేదు. తన గుడ్డి తల్లిని ఎవరు చూసుకుం నిటారు? అని బాధపడింది. "ఏనుగు ఏమీ తినడం లేదు' అనే సమాచారం రాజుగారికి అందింది. రాజుగారే స్వయంగా వచ్చి ఏనుగుని పలకరిం చారు. అప్పుడు ఏనుగు "నాకు ఈ రాజ భోగాలు వద్దు, అడవిలో నా తల్లి ఉంది. నా తల్లిని చూసు కోవడంలోనే నాకు సుఖముంటుంది" అని చెప్పింది.

ఏనుగు మాటలు విని రాజు కరిగిపోయాడు. వెంటనే తెల్ల ఏనుగును మరలా అడవికి పంపే ఏర్పాటు చేసాడు. తెల్ల ఏనుగు తన తల్లికి సేవలు చేస్తూ హాయిగా అడవిలో ఉండిపోయింది.

Comments