Skip to main content

Telugu moral stories episode 1 (తెలుగులో)

Hello guys 🤠 🤗 

నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా మీరు బాగున్నారా అనుకుంటున్నాను. 

ఈరోజు మనం కొన్ని నీతి కథలు చెప్పుకుందాం.

1.) ఒక ఊర్లో  మంచి రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు భూమిని నమ్మకంతో పనిచేసేవాడు. ఒకరోజు, అతనికి ఒక పాత బంగారు కడవ దొరికింది. రైతు ఆ బంగారం అమ్ముకొని, ఊర్లోనే అందరిని సహాయం చేశడు. అందరూ సంతోషంగా ఉండాల చేశాడు. 

ఈ కథ చెప్పే నీతి ఏమిటంటే:- మనం దొరికే అదృష్టాన్ని మనకోసం మాత్రమే కాకుండా, ఇతరుల కోసం కూడా ఉపయోగించుకోవాలి

2.) ఇద్దరు స్నేహితులు అడవిలో నడుచుకుంటూ ఉన్నారు. అకస్మాత్తుగా, వారిని ఒక ఎలుగుబంటి చూసింది. ఒక స్నేహితుడు వెంటనే చెట్టు ఎక్కాడు. మరొక స్నేహితుడు నేలపై పడిపోయారు. చనిపోయినట్టు నటించాడు. ఎలుగుబంటి వాడి దగ్గరకు వచ్చి అతని ముఖం దగ్గర వాసన చూసి, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చెట్టు ఎక్కిన స్నేహితుడు కిందకి వచ్చి, "ఎలుగుబంటి నీ చెవులో ఏమని చెప్పింది ?" అని అడిగాడు. అతని స్నేహితుడు ," అపాయకర సమయంలో నిన్ను వదిలేసినా స్నేహితులను నమ్మవద్దని చెప్పింది" అని సమాధానం చెప్పాడు.

ఈ కథ చెప్పే నీతి ఏమిటంటే నిజమైన స్నేహితుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు

3.) ఒక ఊర్లో ఆవులు ,కుందేలు స్నేహితులు .ఒకరోజు, ఆవు కుందేలును చూసి మీరంతా చిన్నవారు మీకు ఏదైనా ప్రమాదం వస్తే మీరేమీ చేయగలరు అంది కుందేలు సమాధానంగా మేము చిన్న వాళ్ళమే కానీ మా బుద్ధి పెద్ద ఉంటుంది మేము సహాసంతో ఉండటం అన్నారు 

ఈ కథ చెప్పే నీతి ఏమిటంటే, బలం కంటే బుద్ధి గొప్పది.

4.) ఒక అడవిలో తాబేలు, కుందేలు, స్నేహితులు. కుందేలు ఎప్పుడూ తన వేగం గురించి పొగురుకుంటూ ఉండేది. తాబేలు నెమ్మదిగా నడిచేదాన్ని. ఒకరోజు ,కుందేలు తాబేలు చూసి," నువ్వు ఎంత బద్దకం గలవాడివో!  నా వేగంతో పోటీ పడగలవా ? అని అడిగింది తాబేలు సవాలు స్వీకరించి ,పోటీకి సిద్ధమైంది. 
పోటీ ప్రారంభమైంది, అడవిలో ఉండే జంతువులన్నీ పోటీని చూడ్డానికి అడవికి వచ్చేసాయి. కుందేలు సగం దూరం వెళ్ళాక తను గెలిచే పోయానుకుని మధ్యలో విశ్రాంతి తీసుకుంది. తాబేలు తన గమనయాన్ని నెమ్మదిగా నడుస్తుంది కానీ ఆగకుండా వెళ్ళింది కుందేలు నిద్ర లేచేసరికి తాబేలు అప్పటికే గమ్యాన్ని చేరేసింది.

ఈ కథలో చెప్పే నీతి ఏమిటంటే, వేగం కంటే స్త్రీరత్వం, పట్టుదల ఉంటే గమ్యాన్ని సాధించవచ్చు.


Comments

Popular posts from this blog

సాయం మంచిదే Telugu story by HemanthPresents

  సాయం మంచిదే! విజయుడు, అజేయుడు అనే యువరాజులు ఇద్దరూ ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తిచేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఓ చిన్నపరీక్ష పెట్టాలను కున్నారు గురువుగారు. ఇద్దరినీ పిలిపించి... 'నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారి గుహలున్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసు కొస్తారో వారే ఈ పరీక్షలో విజేత' అని చెప్పారు. దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ బయల్దేరారు. దారిలో వారికో వ్యక్తి తీవ్రగాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందని అజేయుడు ముందుకు వెళ్లిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి, అతడికి సపర్యలు చేసి, ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్లిపోయాక విజయుడు మళ్లీ బయల్దేరాడు. కొంతదూరం వెళ్లాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు. అంతేకాదు... వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణి కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు... 'దారిలో గాయాలతో కనిపించ...